: యుక్తాముఖి ఓల్డ్ లవ్ స్టోరీ


1999 ప్రపంచ అందాల సుందరి కిరీటం యుక్తాముఖిని వరించింది. అప్పటికే మోడల్ గా యుక్తాకు మంచి గుర్తింపు ఉంది. 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు, అలరించే అందం, అందాల కిరీటంతో యుక్తాకు బాలీవుడ్ లో అవకాశాలు వచ్చి పడ్డాయి. అక్కడ ఓ మోస్తరు గుర్తింపే వచ్చింది. అప్పటి వరకూ రంగుల అందాల లోకంలో విహరించిన యుక్తా జీవితం 2008లో మలుపు తీసుకుంది. యుక్తా తను నటించిన 'మేంసాబ్' చిత్రం ప్రమోషన్ కోసం నాగ్ పూర్ కు వెళ్లింది. అక్కడ ప్రిన్స్ తులికి చెందిన హోటల్లో బస చేసింది. తులి, యుక్తా ముఖాముఖి చూసుకున్నారు, కానీ మాట్లాడుకోలేదు. నాగ్ పూర్ నుంచి యుక్తా ముంబై కి తిరిగి వచ్చేసింది.

ఆ తర్వాత ఒక రోజు యుక్తాకు అనుకోని కాల్ ఒకటి వచ్చింది. అవతల మగ గొంతు. నేను ప్రిన్స్ అంటూ మాట కలిపాడు. చూడ్డానికి బావున్నాడు... వ్యాపారవేత్త... యుక్తాకి మాటలు పొడిగించడానికి అభ్యంతరాలేవీ కనిపించలేదు. మనసులు ముడివేసుకున్నాయి. ఆ తర్వాత కలిసి విహరించారు కూడా. పెద్దల అంగీకారంతో 2008 నవంబర్ లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత నుంచే ఇద్దరి ఆలోచనలు, భావాల మధ్య అంతరాలు మొదలయ్యాయి. ప్రిన్స్ ప్రవర్తన నచ్చక 2012లో యుక్తా అతడి నుంచి విడిపోయింది. అదే ఏడాది జూలై 4న ముంబైలోని అంబోలా పోలీస్ స్టేషన్లో గృహ హింస చట్టం కింద కేసు పెట్టింది. రెండు రోజుల కిందట తాజాగా తులిపై లైంగిక హింస, అసహజ శృంగారం కింద కూడా కేసులు మోపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News