: భారత విమానయాన భద్రతపై సందేహాలు
భారత పౌరవిమానయాన భద్రతా ప్రమాణాలపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్(ఐసీఏఒ) మన దేశానికి చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) పాటిస్తున్న ప్రమాణాలను తనిఖీ చేయనుంది. అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆడిట్ చేసిన రెండు వారాలకే ఐసీఏఒ కూడా రంగంలోకి దిగుతోంది. దేశంలో విమానాల ట్రాఫిక్ పెరిగిపోతూ ఉంటే డీజీసీఏ సిబ్బందిని తగ్గిస్తూ వస్తోంది. అంతేగాక డీజీసీఏ నిపుణుల కొరతను కూడా ఎదుర్కొంటోంది. ప్రస్తుతమున్న డైరెక్టర్ జనరల్ అరుణ్ మిశ్రా 9ఏళ్ల డిప్యుటేషన్ సర్వీసు ముగిసిపోయింది. దీంతో ఆయన తన సొంత కేడర్ కు వెళ్లనున్నారు. అరుణ్ తర్వాత నిబంధనలకు అర్హుడైన మరో వ్యక్తి లేకపోవడం కూడా ఆందోళనకు కారణం. ఈ నేపథ్యంలో పౌరవిమానయాన భద్రతా ప్రమాణాలను ఐసీఏఒ ఆడిట్ చేయనుంది.