: గ్రామీణ బ్యాంక్ చోరీకి విఫలయత్నం


చోరులు ఏటీఎంలు, బ్యాంకుల మీద కన్నేశారు. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం ఉద్దేహాల్ లోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు చోరీకి కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో బ్యాంకు పరిసరాల్లో అలికిడికి స్థానికులు అప్రమత్తమవ్వడంతో దొంగలు పరుగులంకించుకున్నారు. యువకులు వారిని వెంబడించినప్పటికీ వారు ఎవరికీ దొరకకుండా పారిపోయారు. దీంతో ఘటనపై గ్రామస్థులు పోలీసులకు సమాచారమందించారు. గ్రామాల్లో సాధారణంగా వేళకాని వేళల్లో ఎవరైనా అలికిడి చేస్తే కుక్కలు అరిచిగోల చేసి మేల్కొల్పడంతో గ్రామస్థులు వారి పనిపట్టడం జరుగుతుంటుంది. తాజాగా ఉద్దేహాల్ లో కూడా అదే జరిగింది. అందుకే పట్టణాల్లో కంటే గ్రామాల్లో దొంగతనాలు తక్కువగా జరుగుతుంటాయి. పొరపాటుగా చోరీ జరిగినా వెంటనే గ్రామస్థులు అప్రమత్తమై పహారా కాస్తారు.

  • Loading...

More Telugu News