: రాజీనామాకు ఉమెన్ చాందీ రెడీ
కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ రాజీనామాకు సిద్దపడ్డారు. కేరళలో సంచలనం రేపుతున్న సౌరశక్తి పరికరాల కుంభకోణం నేపధ్యంలో ముఖ్యమంత్రి తాజా నిర్ణయానికి వచ్చారు. ఈ కుంభకోణంలో సీఎంవో హస్తమున్నట్టు వార్తలు వెలువడుతున్న కారణంగా తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి ఉమెన్ చాందీ రాజీనామాకు సైతం రెడీ అంటున్నారు. ఓ ప్రైవేటు భోగస్ కంపెనీకి చెందిన వ్యక్తులతో ముఖ్యమంత్రి కార్యాలయం సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటూ నిబంధనలకు నీళ్లొదలడంతో వారికి సీఎంవో భారీగా లబ్ది చేకూర్చిందనేది ప్రధాన ఆరోపణ. అయితే ఈ కుంభకోణం అటుతిరిగి ఇటుతిరిగి చివరికి ముఖ్యమంత్రి మెడకు చుట్టుకుంది. దాంతో కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ రాజీనామాకు రెడీ అంటున్నారు.