: రాష్ట్ర విద్యార్థులు అన్యాయమైపోతున్నారు: హరికృష్ణ


ఐఐటీ ప్రవేశాల్లో ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇవ్వడం వల్ల రాష్ట్ర విద్యార్థులు అన్యాయమైపోతున్నారని టీడీపీ పార్టీ నేత నందమూరి హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా రోజుల తరువాత హైదరాబాద్ లో మీడియా ముందుకొచ్చిన ఆయన ఐఐటీల్లో ప్రవేశానికి అర్హత శాతం పెంచాలన్నారు. రాష్ట్ర విద్యార్థులకు అన్యాయం జరుగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. జేఈఈ ఎంట్రన్స్ లో సాధించిన మార్కుల ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించాలని నందమూరి హరికృష్ణ కోరారు.

  • Loading...

More Telugu News