: కలత నిద్రకు కారణం ఇదే


మనలో కొందరు నిద్ర రుగ్మతతో బాధపడుతుంటారు. దీన్నే నార్కోలెప్సీగా (కలత నిద్ర) వైద్య పరిభాషలో చెబుతుంటారు. ఈ నార్కోలెప్సీకి అసలు కారణం ఏమనే విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధితో బాధపడేవారి మెదడులో న్యూరో పెప్టైడ్‌ హిపోక్రెటిన్‌ అనే నాడీకణాలు తక్కువగా ఉన్నట్టు, ఈ కారణంగానే వారిలో నార్కోలెప్సీ వ్యాధి వస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.

కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నార్కోలెప్సీకి కారణం గురించి పరిశోధన చేశారు. మనల్ని హిపోక్రెటిన్‌ అనే రసాయనం మెలకువగా ఉంచుతుంది. మనలో చురుకుదనాన్ని, భావోద్వేగాల్ని ఇది పెంచుతుందని, అయితే ఈ హిపోక్రెటిన్‌ నాడీ కణాలు మరణిస్తే, నిద్ర రుగ్మత అయిన నార్కోలెప్సీ తలెత్తుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ఈ కణాలను ఏవి చంపుతున్నాయి? అనే విషయం ఇంకా స్పష్టం కాలేదు. ఈ వ్యాధితో బాధపడే వారిలో హిస్టమిన్‌తో కూడిన మెదడు కణాలు 65 శాతం దాకా అధికంగా ఉండడాన్ని తమ పరిశోధనలో గుర్తించినట్టు జెరోమ్‌ సీగెల్‌ చెబుతున్నారు. ఈ హిస్టమిన్‌ కణాలు ఎక్కువగా ఉండడం వల్ల నార్కోలెప్సీతో బాధపడేవారిలో హిపోక్రెటిన్‌ కణాలు నష్టపోతున్నట్టు సీగెల్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News