: పదకొండు వేలకు కక్కుర్తిపడిన ఎస్సై
ఓ ఎస్సై రూ.11 వేలకు కక్కుర్తిపడి ఉద్యోగానికి ఎసరు తెచ్చుకున్నాడు. మచిలీపట్నం రాబర్ట్ సన్ పేట పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్ స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న నవీన్.. ఓ వ్యక్తి నుంచి లంచం స్వీకరిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా రాబర్ట్ సన్ పేట పోలీస్ స్టేషన్ కు ఈ సాయంత్రం ఏసీబీ అధికారులు రాగా.. సరిగ్గా అదే సమయానికి ఎస్సై లంచం అందుకుంటూ కనిపించాడు. ఆ వ్యవహారంలో ఎస్సై నవీన్ తో పాటు కానిస్టేబుల్ నాగరాజుకూ వాటా ఉందని గ్రహించిన ఏసీబీ అధికారులు ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు షురూ చేశారు.