: మూడు రోజుల్లో పందొమ్మిది కోట్లు కురిపించిన బాలీవుడ్ చిత్రం
బాలీవుడ్ లో 'ఉదాన్' సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన విక్రమాదిత్య మోత్వానీ.. తొలి సినిమాతో పెద్దగా మార్కులు సంపాదించకపోయినా.. రెండో సినిమా 'లూటేరా'తో మాత్రం బాక్సాఫీసును షేక్ చేస్తున్నాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ ఆదివారం నాటికి రూ.19 కోట్లు వసూలు చేసిందట. హీరోహీరోయిన్లు రణ్ వీర్ సింగ్, సోనాక్షీ సిన్హాల మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా పండిందనడానికి ఈ వసూళ్ళే నిదర్శనమని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. సుప్రసిద్ధ ఆంగ్ల రచయిత ఓ.హెన్రీ రాసిన 'ది లాస్ట్ లీఫ్' నవలకు చిత్రరూపమే 'లూటేరా'.