: కిడ్నాపర్ల కోసం గాలింపు.. నిలకడగా నిఖిల పరిస్థితి
హైదరాబాద్ లో కూడా మహిళలకు భద్రత లేకుండా పోయింది. ఆటోలో ఎక్కిన యువతిని అపహరించి అత్యాచారం చేద్దామనుకున్నారు ఆటోవాలాలు. సాహసించి ఆటోలోంచి దూకడంతో ఇప్పుడా యువతి ప్రాణాపాయ పరిస్థితులలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.
గోవా రాష్ట్రానికి చెందిన నిఖిల హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. మంగళవారం రాత్రి మాదాపూర్ ప్రాంతంలో షేరింగ్ ఆటో ఎక్కింది. కొంచెం దూరం వెళ్లాక ఆటోలో మిగతావారు దిగిపోయారు. ఇదే అదనుగా ఆమెను అపహరించాలనుకున్న ఆటో డ్రైవర్, అతని సహాయకుడు గచ్చిబౌలి వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆమె ఆటోలోంచి దూకేసింది.
వెంటనే ఆటోవాలాలు తప్పించుకుపోయారు. నిఖిలకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. విషయం తెలియడంతో నిఖిల తల్లిదండ్రులు గోవా నుంచి ఈ ఉదయం హైదరాబాద్ కు చేరుకున్నారు.