: మోత్కుపల్లి హత్యాయత్నానికి రెక్కీ నిర్వహించిన వారిని శిక్షించండి: చంద్ర బాబు
టీడీపీ దళితనేత మోత్కుపల్లి నర్సింహులుపై హత్యాయత్నానికి రెక్కీ నిర్వహించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. హైదారాబాద్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ నుంచి కీలక నేతగా ఎదిగిన మోత్కుపల్లిని అంతమొందించేందుకు ప్రత్యర్ధులు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో మోత్కుపల్లికి అదనపు భద్రత కల్పించాలని కోరుతూ ఆయన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. కాగా, ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా కోర్టు ఆవరణలో ఏకే-47 తుపాకీ అపహరణకు గురికాగా.. ఆ కేసుపై సత్వర విచారణ జరిపించాలని బాబు తన లేఖలో పేర్కొన్నారు.