: నేపాల్ లో బౌద్ధ మందిరాల వద్ద భద్రత పెంపు
భారత్ లోని ప్రముఖ బౌద్ధ క్షేత్రం బుద్ధగయలో నిన్న బాంబు పేలుళ్ళు సంభవించిన నేపథ్యంలో నేపాల్ లోని బౌద్ధ మందిరాల వద్ద భద్రత పెంచారు. నిఘా వర్గాలనుంచి సమాచారం లేకపోయినప్పటికీ, ముందుజాగ్రత్తగా సుప్రసిద్ధ ఆరామాల వద్ద భద్రత కట్టుదిట్టం చేశామని నేపాల్ పోలీసులు వెల్లడించారు. బుద్ధుడి జన్మస్థలమైన 'లుంబిని' వద్ద భారీగా పోలీసులను మోహరించారు. బుద్దుడు బాల్యం గడిపినట్టుగా భావిస్తున్న 'కపిలవస్తు' ఆరామం కూడా రక్షణ ఛత్రంకిందకు వచ్చింది.