: టైటిల్ చాలు.. నెంబర్ వన్ తో పనిలేదు: ముర్రే


'టైటిల్ గెలిచాను, అది చాలు. నెంబర్ వన్ కాకపోయినా ఫర్వాలే'దని వింబుల్డన్ విజేత ఆండీ ముర్రే అన్నాడు. లండన్ లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ముర్రే తన ర్యాంకింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 77 ఏళ్ల తరువాత ఇంగ్లాండ్ కు వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ అందించిన ముర్రే ఇప్పటికీ ఏటీపీ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలోనే ఉన్నాడు. దీనిపై స్పందిస్తూ రెండు గ్రాండ్ స్లామ్స్, ఒక ఒలింపిక్ పతకం గెలుచుకున్నా తానింకా ఎందుకు నెంబర్ వన్ ర్యాంకింగ్ అందుకోలేదో తనకర్ధం కావడం లేదన్నాడు. అయితే తనకు మాత్రం నెంబర్ వన్ అనిపించుకోవడం కన్నా గ్రాండ్ స్లామ్స్ గెలుచుకోవడమే ఇష్టమంటున్నాడు.

  • Loading...

More Telugu News