: రేపు ఉదయం శ్రీవారికి సెలవు
నిత్యం భక్తులకు దర్శనమిస్తూ, విశిష్ట కైంకర్యాలు అందుకుంటూ, తీరికలేకుండా ఉండే తిరుమల వెంకటేశ్వరుడికి కాసింత విశ్రాంతి! రేపు ఉదయం శ్రీవారి సన్నిధిలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తున్న సందర్బంగా ఏడుకొండలవాడి దర్శనాన్ని రద్దు చేస్తున్నట్టు టీటీడీ తెలిపింది. రేపు ఉదయం 11 గంటల వరకు దర్శనంతోపాటు ప్రత్యేక సేవలు కూడా ఉండవని టీటీడీ వర్గాలు పేర్కొన్నాయి.