: భారత్ వల్లే పాక్ లో నీటి కొరత: 'టెర్రర్' నాయకుడి ఆరోపణ
భారత్ ఇష్టం వచ్చినట్టు డ్యామ్ లు నిర్మించడంవల్లే పాకిస్తాన్ లో నీటి లభ్యత తగ్గి కరెంటు కష్టాలు ఉత్పన్నం అయ్యాయని నిషేధిత జమాత్ ఉద్ దవా తీవ్రవాద సంస్థ అధినేత హఫీజ్ సయీద్ ఆరోపించాడు. అందుకే భారత్ తో సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పాక్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాడు. భారత్.. 62 నదులపై ప్రాజెక్టులు నిర్మించి ఉద్ధేశపూర్వకంగానే పాక్ లో నీటి కొరతను సృష్టిస్తోందని అన్నాడు. ఇక పాక్ లో ఉగ్రవాదానికి భారతే కారణమని అంటున్నాడు సయీద్. అందుకే, ఇకనుంచి పాక్.. చైనాతో అంటకాగాలని సూచిస్తున్నాడు. చైనాతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని ప్రధాని నవాజ్ షరీఫ్ కు సలహా కూడా ఇచ్చాడీ తీవ్రవాద మూక నాయకుడు.