: తెలంగాణపై త్వరలోనే 'స్వీట్ న్యూస్' వింటారు: దిగ్విజయ్
తెలంగాణ అంశంపై త్వరలోనే తీపి కబురు చెవినబడుతుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులతో చెప్పారు. ఓయూ జేఏసీ నేతలు నేడు ఢిల్లీలో దిగ్విజయ్ ను కలిశారు. ఈ సందర్భంగా వారికి డిగ్గీ రాజా (దిగ్విజయ్) మిఠాయిలు పంచారు. అయితే, తమకు స్వీట్లు ఇవ్వడం కాదని తెలంగాణపై తియ్యనివార్త చెప్పాలని వారు ఆయనను కోరారు. విద్యార్థుల డిమాండ్ పై కాంగ్రెస్ సీనియర్ నేత సానుకూలంగా స్పందించారు.