: జడేజాకు బీసీసీఐ చీవాట్లు
టీమిండియా సహచరుడు సురేశ్ రైనాతో గొడవకు దిగిన రవీంద్ర జడేజాకు బీసీసీఐ చీవాట్లు పెట్టింది. ఇలాంటి సంఘటన పునరావృతమైతే సహించేది లేదని తీవ్రంగా మందలించింది. ముక్కోణపు టోర్నీలో భాగంగా శుక్రవారం ఆతిథ్య వెస్టిండీస్ జట్టుతో మ్యాచ్ సందర్బంగా జడేజా, రైనా మధ్య మైదానంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జట్టు కోచ్ డంకన్ ఫ్లెచర్, మేనేజర్ రంజీబ్ బిశ్వాల్.. బీసీసీఐకి ఓ నివేదిక సమర్పించారు. ఇరువురు ఆటగాళ్ళ వాదనలను అందులో పొందుపరిచారు. జడేజానే రైనాను రెచ్చగొట్టేలా ప్రవర్తించాడని ఆ నివేదికలో వారు పేర్కొన్నట్టు సమాచారం. కాగా, ఈ విషయమై బోర్డు జడేజాను లిఖితపూర్వకంగా వివరణ కోరింది. ఇక కొసమెరుపేంటంటే.. ఇంత గొడవ జరిగినా, మ్యాచ్ ముగిసిన వెంటనే జడేజా, రైనా ఒకరి భుజంపై మరొకరు చేతులు వేసుకుని నవ్వుకుంటూ కులాసాగా మైదానం వీడారు.