: బుద్ధగయ పేలుళ్ళు 'ఇండియన్ ముజాహిదిన్' పనేనా..?


బీహార్లోని బుద్ధగయ క్షేత్రంలో నిన్న జరిగిన పేలుళ్ళ తమపనే అని ఇంతవరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించకపోయినా.. ఈ దాడి వెనుక 'ఇండియన్ ముజాహిదిన్' హస్తం ఉండవచ్చని జాతీయ దర్యాప్తు సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ఇక్కడి మహాబోధి ఆలయంలో జరిగిన ఈ వరుస పేలుళ్ళలో ఎవరూ మరణించకపోయినా.. ఈ ఘటన ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కాగా, ఈ విధ్వంసానికి ఉపయోగించిన బాంబుల్లో అమ్మోనియం నైట్రేట్ ఉపయోగించినట్టు ఫోరెన్సిక్ నివేదికలు తెలుపుతున్నాయి. ఈ బాంబులను టైమర్ల సాయంతో పేల్చినట్టుగా తెలుస్తోంది.

ఈ విధంగా పేలుళ్ళకు పాల్పడేది 'ఇండియన్ ముజాహిదిన్' తీవ్రవాదులే అని దర్యాప్తు సంస్థలు అంటున్నాయి. ఈ బాంబుల్లో ఆర్డీఎక్స్ వాడలేదని ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు. పేలుడు అనంతరం ప్రభావం ఎక్కువగా ఉండేందుకు వాటిలో బాల్ బేరింగులు, పదునైన ఇనుపముక్కలు కూరినట్టు వారు తెలిపారు.

  • Loading...

More Telugu News