: శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకూ అందరిదీ ఒకటే వాదం: మంత్రి శైలజానాథ్
శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకూ ప్రజలది, నాయకులది ఒకటే వాదమని రాష్ట్ర ప్రాధమిక విద్యాశాఖా మంత్రి శైలజానాథ్ తెలిపారు. అనంతపురంలో జరిగిన మేధావుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, గతంలో కేంద్రం ప్రకటించిన విధంగానే రాష్ట్రం సమైక్యంగా ఉందని, ఇకపై కూడా అలాగే ఉంటుందని అన్నారు. విభజనకు వ్యతిరేకంగా అనంతపురం జిల్లా నుంచి ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామన్నారు. 9 తేదీ నుంచి జేఏసీ తలపెడుతున్న కార్యాచరణ కార్యక్రమాలకు తమవంతు సహకారమందిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ఉపాధ్యాయులు, ఆచార్యులు, ప్రముఖులు పాల్గొన్నారు.