: ముప్పైవేల మార్క్ ను వీడని బంగారం ధరలు
మంగళవారం మార్కెట్లో బంగారం ధరలు అంతకుముందు రోజు కంటే కొద్దిగా తగ్గినట్టే కనిపిస్తున్నాయి. హైదరాబాద్ నగర మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ఆరంభపు ధర 30,400 ఉంటే, ముగింపు ధర 30,600 ఉంది. విజయవాడలో ఆరంభపు ధర 30,330 ఉంటే ముగింపు ధర 30,350 ఉంది.
ఇక ప్రొద్దుటూరులో ముగింపు ధర 30,400 పలికింది. రాజమండ్రిలో ఆరంభపు ధర 30,360 ఉంటే, ముగింపు ధర 30,350 ఉంది. అటు విశాఖపట్నంలో ఆరంభపు ధర 30,290 ఉండగా, ముగింపు ధర 30,350 వరకు పలికింది. ఇక కిలో వెండి ధర అత్యధికంగా హైదరాబాద్ మార్కెట్ లో 59,300 పలకగా, తక్కువగా విశాఖపట్నంలో 56,900 ఉంది.