: బ్రాహ్మణులకు 21.. దళితులకు 17.. మాయావతి గాలం
ఉత్తరప్రదేశ్ లో 2014 లోక్ సభ ఎన్నికలకు మాయావతి అప్పుడే సమరం ఆరంభించారు. లక్నోలో జరిగిన బ్రాహ్మణ మహా సమ్మేళనం కేంద్రంగా అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించారు. యూపీలో మొత్తం 80 లోక్ సభ స్థానాలకు గాను 38 స్థానాలను కేవలం బ్రాహ్మణులు, దళితులకే కేటాయించి ఓటు బ్యాంకుకు గురిపెట్టారు. అక్కడ వీరి జనాభానే అధికం. బ్రాహ్మణ వర్గం వారికి 21, దళిత వర్గం వారికి 17 కేటాయిస్తున్నట్లు ఆమె చెప్పారు. అంతేకాదు, బ్రాహ్మణులకు మరిన్ని టికెట్లు ఇస్తానని ప్రకటించారు. వారు పార్టీ కోసం ఎక్కువగా పని చేస్తున్నారని కితాబిచ్చారు. అలాగే, ఇతర అగ్రవర్ణాలు, ముస్లింలు కూడా పార్టీ కోసం కష్టిస్తే వారికీ అగ్ర భాగం సీట్లను కేటాయిస్తానని, అధికారంలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇచ్చారు.