: దటీజ్ మిస్టర్ పర్ఫెక్ట్... అమీర్ ఖాన్
అమీర్ ఖాన్ విలక్షణమైన సినీ నటుడు. నటులందరిదీ ఓ పంథా అయితే అమీర్ ఒక్కడిదీ ఒక పంథా. తనకు సూపర్ స్టార్ హోదా నిచ్చిన ప్రజలకు ప్రతిగా ఏదో మేలు చేయాలనుకుంటాడు. అందుకే సమాజానికి ఉపయోగపడే ఏ పనికైనా అమీర్ ఖాన్ ముందుంటాడు. అది గవర్నమెంట్ యాడ్ అయినా, 'సత్యమేవ జయతే' లాంటి ప్రోగ్రామైనా, ఎయిడ్స్ వ్యతిరేక ఉద్యమమైనా, జంతు హింస వ్యతిరేక ఉద్యమమైనా మిస్టర్ పర్ఫెక్ట్ శైలే వేరు. తాజాగా ఉత్తరాఖండ్ వరద బాధితులను ఆదుకునేందుకు 25 లక్షల రూపాయల విరాళమిచ్చి తన ఉదారత చాటుకున్నాడు.
అంతటితో ఆగకుండా, వారికి తన సహాయం సరిపోదని తలచి మరింత విరాళమందించేందుకు సహాయనిధిని కూడగట్టేందుకు సంకల్పిచాడు. అందుకోసం ఓ కాన్సర్ట్ నిర్వహించే ఆలోచనలో ఉన్నాడు. అమీర్ ఖాన్ తో పాటు ఇప్పటికే ఎంపీలు జావెద్ అఖ్తర్, శత్రుఘ్నసిన్హా వారి ఎంపీ నిధుల నుంచి తలో 50 లక్షల విరాళం ప్రకటించారు. షబానా అజ్మీ తన ఎన్జీవొ సంస్ధ తరపుని 5 లక్షల విరాళమందించింది.
అనుపమ్ ఖేర్ లక్ష రూపాయలు విరాళం ప్రకటించారు. కాగా పెద్ద నటులకు దీటుగా సీనీ, టీవీ కళాకారులు కొంత మొత్తాన్ని అందించనున్నారు. మరి కొంత మంది కాన్సెర్ట్ లో పాలు పంచుకోనున్నారు. దాని ద్వారా వచ్చే మొత్తాన్ని వరద బాధితులకు సహాయంగా అందజేస్తారు.