: నాకు సెప్పకుండా మీటింగెట్టుకుంటారా?: బొత్స ఆగ్రహం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన శాసనసభ కమిటీ హాల్ లో సీఎల్పీ కార్యవర్గం భేటీ అయింది. ఈ సమావేశంలో పలు సమస్యలపై చర్చించిన కార్యవర్గం, ఉత్తరాఖండ్ వరద బాధితులకు సాయం ఖరారు చేసింది. అయితే సీఎల్పీ సమావేశంపై తనకు కనీసం సమాచారం లేదని పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సమావేశంలో వైఎస్ కు నివాళుల అంశంపై సైతం తనకు సమాచారం అందలేదన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనను దూరం పెడుతున్నారా? అంటూ బొత్స నేతలను ప్రశ్నించారు.