: మళ్లీ ప్రేమలో పడ్డ వసీం అక్రం.. త్వరలో పెళ్లి


పాక్ లెజెండరీ బౌలర్ వసీం అక్రం 47 ఏళ్ల వయసులో మళ్లీ ప్రేమలో పడ్డాడు. మెల్ బోర్న్ కు చెందిన 30 ఏళ్ల షనీరా థాంప్సన్ ను త్వరలోనే పెళ్లాడబోతున్నాడట. వివాహితుడైన అక్రం, 2009లో భార్య హుమాను కోల్పోయాడు. అప్పటి నుంచీ తన పిల్లల కోసం ఒంటరిగానే జీవితాన్ని సాగిస్తున్న అక్రంకు, ఈమధ్య కాలంలో చాలా మందితో సంబంధాలు ఉన్నాయంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. సుస్మితా సేన్ తో అక్రం ప్రేమ వ్యవహారం కొనసాగుతోందనే వార్తలు కూడా వచ్చాయి.

అయితే, తనకు తన పిల్లలే లోకమని, వివాహం చేసుకునే యోచన లేదంటూ అక్రం పలుమార్లు స్పష్టం చేశాడు. మొత్తానికి అక్రం షమీరా ప్రేమకు దాసుడయ్యాడు. షమీరా థాంప్సన్ ను అక్రం మొదటి సారిగా 2011లో కలుసుకున్నాడు. "నేను మళ్లీ పెళ్లి చేసుకుంటానని అనుకోలేదు. కానీ, మరోసారి ప్రేమ లభించినందుకు సంతోషంగా ఉంది" అని వసీం థాంప్సన్ తో చెప్పాడట. మొత్తానికి అమ్మడు కూడా ఓకే చెప్పింది. ఇప్పటికే థాంప్సన్ ఇస్లాం మతం స్వీకరించిందని సమాచారం. పెళ్లి అనంతరం పాక్ కు తన మకాం మారుస్తుందట!

  • Loading...

More Telugu News