: డోర్నకల్ లో 55 గ్రామాలతో సమస్యే
పంచాయతీ ఎన్నికల సందర్భంగా వరంగల్ జిల్లాలోని డోర్నకల్ నియోజక వర్గంలో సమస్యాత్మక గ్రామాలను పోలీసులు గుర్తించారు. ఈ నియోజక వర్గంలో మొత్తం 84 పంచాయతీలు ఉండగా అందులో అత్యంత సమస్యాత్మకమైన పంచాయతీలు 23 కాగా, సమస్యాత్మకమైన గ్రామ పంచయతీలు 32 అని పోలీసులు గుర్తించారు. వీటిల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సమస్యలను ఎవరైనా సృష్టిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామస్థులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.