: మోడీ.. మహోబోధి పేలుళ్లకు లింకు?: దిగ్విజయ్


వివాదాస్పద వ్యాఖ్యానాలకు పెట్టింది పేరైన ఏఐసీసీ నేత దిగ్విజయ్ సింగ్ మహోబోధి పేలుళ్లను బీజేపీతో ముడిపెట్టే ప్రయత్నం చేశారు. మహబోధి పేలుళ్ల వెనుక బీజేపీ కుట్ర దాగుందన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. మహోబోధి పేలుళ్ల వెనుక మరో కోణం చూడండి. బీజేపీ ఉత్తరప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జ్ అమిత్ షా అయోధ్యలో రామాలయం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బీహార్ సీఎం నితీశ్ కు బుద్ధి చెప్పండంటూ మోడీ పార్టీ కార్యకర్తలకు చెప్పారు. ఆ మరుసటి రోజే బుద్ధగయలో పేలుళ్లు జరిగాయి. వీటి మధ్య ఏమైనా సంబంధం ఉందా? అని ప్రశ్నించి, తనకు తెలియదని మళ్లీ దిగ్విజయే చెప్పారు. అసలు నిజం ఎన్ఐఏ దర్యాప్తులో తేలుతుందన్నారు.

దిగ్విజయ్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. దీంతో దిగ్విజయ్ నోరుజారానని గ్రహించారు. భవిష్యత్తులో ఏదైనా మాట్లాడేటప్పుడు సంయమనం పాటిస్తానని లెంపలేసుకున్నారు. రాజకీయ పార్టీలు గానీ, మీడియా గానీ ఏ అంశానికైనా ముందే ముగింపు ఇవ్వరాదన్నారు.

  • Loading...

More Telugu News