: చిరకాల ప్రత్యర్ధుల పోరులో గ్రాహెం ఆనియన్స్ కు చోటు
చిరకాల ప్రత్యర్ధులు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ల మధ్య జరుగనున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సమరానికి రెండు జట్లు సిద్దమౌతున్నాయి. హోరా హోరీగా జరిగే యాషెస్ కు ఎత్తులు పైఎత్తులతో ఆసీస్, ఇంగ్లీష్ టీంలు తలపడతాయి. సిరిస్ ను గెలుచుకునేందుకు ఇంగ్లాండ్ జట్టు ఐదో బౌలర్ కు జట్టులో చోటు కల్పించింది. మెరుగైన ప్రదర్శన చేయాలంటే ఆసీస్ ను కట్టడి చేయాలని అందుకు సమర్ధవంతమైన బౌలింగ్ వనరులుండాలని ఆలోచించిన ఇంగ్లాండ్ టీం గ్రాహెం ఆనియన్స్ ను ఎంపిక చేసింది. అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్, స్టీవెన్ ఫిస్ తో ఆనియన్స్ బంతి పంచుకోనున్నాడు.
మోకాలి గాయంతో జట్టుకు దూరమైన కెవిన్ పీటర్సన్ మళ్లీ ఈ సిరీస్ తో బరిలో దిగనున్నాడు. కేపీకి ఆస్ట్రేలియాపై మంచి రికార్డుంది. దీంతో ఇంగ్లాండ్ జట్టు యాషెస్ ట్రోఫీని సాధిస్తుందని సెలెక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఇండియా పాక్ మధ్య మ్యాచ్ లాగే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మ్యాచ్ ను కూడా అభిమానులు బాగా ఇష్టపడతారు. భారీగా బెట్టింగ్ కూడా జరుగుతుంది. అభిమానుల మధ్య భావోద్వేగాలు కూడా అదుపుతప్పుతుంటాయి.