: ఒక్కో టీవీ 27 లక్షల పైమాటే!


టీవీల మార్కెట్ మారిపోయింది. కంపెనీలు సంపన్నుల కోసం, ఉన్నతాదాయ వర్గాల వారే లక్ష్యంగా అధిక ధరలతో కూడిన అధునాతన టీవీలను తీసుకొస్తున్నాయి. శామ్ సంగ్ ఇటీవలే 84 అంగుళాల అల్ట్రా హెచ్ డీ టీవీని విడుదల చేసింది. దీని ఖరీదు 27లక్షల రూపాయలట. హై ఎండ్ అల్ట్రా హై డెఫినిషన్ టీవీల తయారీపై శామ్ సంగ్, ఎల్జీ ప్రత్యేకంగా దృష్టి సారించాయి. కస్టమర్లు పెద్ద సైజు తెర ఉన్న టీవీలను కోరుకుంటున్నారట. వారి అభిరుచులు, అవసరాలను తీర్చేలా కంపెనీలు స్మార్ట్ టీవీలను తయారు చేస్తున్నాయి. సాధారణ హెచ్ డీ టీవీ కంటే అల్ట్రా హై డెఫినిషన్ టీవీ(యూహెచ్ డీ)ల పిక్సల్ రిజల్యూషన్ నాణ్యత నాలుగు రెట్లు అధికంగా ఉంటుంది. దీంతో సంపన్నులు వీటిపైనే మోజు పడుతున్నారు. హెచ్ డీ టీవీలు లక్ష రూపాయలలో దొరుకుతుంటే.. యూహెచ్ డీ టీవీ కావాలంటే 20లక్షల రూపాయల వరకూ పెట్టుకోవాలి. మధ్యతరగతి వ్యక్తి ఇల్లు కొనుక్కుంత ఖరీదన్నమాట!

  • Loading...

More Telugu News