: నోటీసులిచ్చినా పట్టించుకోకపోవడం వల్లే కూలిపోయింది: దానం నాగేందర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ అధికారులు నోటీసులిచ్చినా పట్టించుకోకపోవడం వల్లే ఈ భవనం కూలిపోయిందని మంత్రి దానం నాగేందర్ అన్నారు. సికింద్రాబాద్ లో కుప్పకూలిన సిటీలైట్ హోటల్ శిధిలాల తొలగింపు పనులను పర్యవేక్షించేందుకు చేరుకున్న మంత్రి భవన యజమానులపై మండి పడ్డారు. ఇప్పటికైనా పురాతన భవన యజమానులు మేల్కోని కాలంచెల్లిన భవనాలను కూల్చాలని, లేని పక్షంలో జీహెచ్ఎంసీ అధికారులే కూల్చేస్తారని తెలిపారు. యజమానుల నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందన్న ఆయన, క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తామని తెలిపారు. అయితే సిటిలైట్ హోటల్ భవనాన్ని పురాతన భవనంగా లెక్కించలేదని అధికారులు తెలుపుతున్నారు. శిధిలాల తొలగింపు, సహాయక చర్యలు ముమ్మరంగా చేస్తున్నారు.