: బ్రిటన్ కల సాకారం


77ఏళ్ల బ్రిటన్ కలను టెన్నిస్ వీరుడు ఆండీ ముర్రే ఆదివారం నెరవేర్చాడు. వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిల్ ను గెలుచుకుని సత్తా చాటాడు. లండన్ లో జరిగిన ఫైనల్స్ లో సెర్బియన్ క్రీడాకారుడు నోవాక్ జోకోవిచ్ పై మూడు గంటల తొమ్మిది నిమిషాలపాటు పోరాడి 6-4, 7-5, 6-4 తేడాతో ముర్రే టైటిల్ సొంతం చేసుకున్నాడు. చివరిసారిగా 1936లో బ్రిటన్ కు చెందిన ఫ్రెడ్ పెర్రీ వింబుల్డన్ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఇన్నాళ్లకు మళ్లీ ముర్రేతో ఆ టైటిల్ బ్రిటన్ కు దక్కింది.

  • Loading...

More Telugu News