: సికింద్రాబాదులో కుప్పకూలిన హోటల్ ... పలువురి మృతి


సికింద్రాబాదులోని 'సిటీలైట్' హోటల్ ఈ రోజు ఉదయం కుప్పకూలడంతో విషాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో పలువురు మృతి చెందినట్టు భావిస్తున్నారు. ఇప్పటికి ఆరు మృతదేహాలను వెలికి తీశారు. శిధిలాల వెలికితీత కార్యక్రమం వేగంగా జరుగుతోంది. శిధిలాల కింద మరో ఇరవైమంది ఉంటారని అనుకుంటున్నారు. ఉదయం పూట కావడంతో ఇరానీ చాయ్ తాగడానికి ఈ హోటల్ కి పలువురు వస్తుంటారు. రాష్ట్రపతి రోడ్డులోని రెండస్తుల భవనంతో కూడిన ఈ హోటల్ చాలా పురాతనమైనది కావడంతో కుప్పకూలిందని పోలీస్ కమీషనర్ అనురాగశర్మ చెప్పారు. సహాయ కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి.

  • Loading...

More Telugu News