: విరిగిన ఎముకకు త్రీ`డీ కట్టు
మీ చేయి విరిగితే ఇక దానికి పిండి కట్టు, లేదా మరేదైనా కట్టు అంటూ చేతికి మించిన భారం ఉండే కట్టు కట్టుకోవడం జరుగుతుంటుంది. అయితే చిన్నపాటి కట్టుతో మీ ఎముకలను చక్కగా అతికేలా చేయవచ్చు. ఈ విషయంపై అనేక పరిశోధనలు జరిగిన తర్వాత శాస్త్రవేత్తలు పెద్ద దెబ్బకైనా చిన్న కట్టు చాలు అంటున్నారు.
మనకు ఎముకలు విరిగితే మనం మోయలేనంత బరువైన కట్టు కట్టుకుంటుంటాం. దీనివల్ల మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాకాకుండా దెబ్బతిన్న ఎముకలు సరిగ్గా అతుక్కునేందుకు తోడ్పడే అత్యాధునికమైన తేలికపాటి కట్టును పరిశోధకులు రూపొందించారు. ఈ కట్టువల్ల బరువైన ప్లాస్టర్ల బెడదనుండి విముక్తి పొందవచ్చని వారు చెబుతున్నారు. వల్కలం (కోర్టెక్స్ కాస్ట్)తో తయారు చేసే ఈ సరికొత్త కట్టువల్ల ఎలాంటి భారమూ ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎక్స్‌రే, త్రీడీ స్కాన్ ద్వారా ఎముకలు విరిగిన పేషంట్ల పరిస్థితిని గుర్తిస్తారు. దానికి అనుగుణంగా ప్రింటెడ్ త్రీడీ నమూనాలను ఆవిష్కరిస్తారు. ఈ నమూనాలను ఎముకలు విరిగిన చోట వాడుతారు. ఒక్కముక్కలో చెప్పాలంటే శాస్త్రవేత్తలు 'త్రీడీ కాస్ట్'గా చెబుతున్నారు.