: ఏకగ్రీవంగా ఎన్నికైన తానా నూతన కార్యవర్గం


అమెరికాలో తెలుగువారి సంక్షేమం కోసం కృషి చేసే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. కార్వనిర్వాహక ఉపాధ్యక్షుడిగా డాక్టర్ జంపాల చౌదరి ఎన్నికయ్యారు. ఇక కార్యదర్శిగా వేమన సతీష్, కోశాధికారిగా తాతా మధు ఎన్నికయ్యారు. వీరందరి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందని తానా అధ్యక్షుడు తోటకూర ప్రసాద్ వెల్లడించారు

జంపాల చౌదరి 2015లో తానా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు. తెలుగువారి సంక్షేమం, అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తానని చౌదరి పేర్కొన్నారు. కాగా, ప్రస్తుతం ఉపాధ్యక్షుడుగా ఉన్న నన్నపనేని మోహన్... తోటకూర ప్రసాద్ నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి 2015 వరకు పదవిలో కొనసాగుతారు.

  • Loading...

More Telugu News