: గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో శ్రీలంక 37/3
గెలిచితీరాల్సిన మ్యాచ్ లో శ్రీలంక పది ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో శ్రీలంక బ్యాటింగ్ కు దిగింది. తరంగ, జయవర్ధనే చెరో ఏడు పరుగులు చేసి పెవిలియన్ చేరారు. దీంతో మైదానంలోకి దిగిన సంగక్కర, చండిమాల్ ఆచి తూచి ఆడడం మొదలెట్టినా, కేవలం 2 పరుగులు మాత్రమే చేసి చండిమాల్ అవుటయ్యాడు. దీంతో కేవలం 29 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. రోచ్ రెండు వికెట్లు తీసుకుని రాణించగా అతనికి హోల్డర్ ఒక వికెట్ తీసుకుని చక్కని సహకారమందించాడు.