: హృతిక్ రోషన్ శస్త్రచికిత్స విజయవంతం: రాకేష్ రోషన్
హృతిక్ రోషన్ మెదడుకు చేసిన శస్త్ర చికిత్స విజయవంతమైందని అతని తండ్రి రాకేష్ రోషన్ తెలిపారు. దీంతో హృతిక్ రోషన్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పుకెట్ లో 'బ్యాంగ్ బ్యాంగ్' షూటింగ్ సందర్భంగా గాయపడ్డ ఆయన గత రెండు నెలలుగా తీవ్రమైన తలనొప్పితో బాధపడ్డారు. హృతిక్ రోషన్ తలలో రక్తం గడ్డకట్టిందని, దేవుడి దయవల్ల అతను క్షేమంగా బయటపడ్డాడంటూ డాక్టర్లు తెలిపారు. హృతిక్ రోషన్ కు హిందూజా ఆసుపత్రికి చెందిన ప్రముఖ గామా నైఫ్ స్పెషలిస్టు డాక్టర్ బీకే మిశ్రా విజయవంతంగా ఆపరేషన్ చేసి క్లాట్ తొలగించారు.