: సినిమా వాళ్లు కోట్లు తీసుకుంటూ అశ్లీలత చూపకూడదు: లక్ష్మీనారాయణ


సినిమా వాళ్లు అవినీతికి పాల్పడుతున్నారని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీనారాయణ, లక్షల రూపాయల పారితోషికాలు తీసుకుని అశ్లీల పాటలు రాస్తూ, సాహిత్యసేవకులుగా ఢంకా బజాయించుకునే పాటల రచయితలు తన దృష్టిలో అవినీతికి పాల్పడుతున్నట్టేనని ఆయన అన్నారు. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుని, దుష్ప్రభావాలు కలిగించే సినిమాలను యువతరం మీదికి వదిలే దర్శకులు కూడా తన దృష్టిలో అవినీతి పరులేనన్నారు.

సినిమాల్లో ఉన్నంత వికృతంగా సమాజం లేదని, సినిమా వాళ్లు మాత్రం యువతరం కౌగిలింతలు, ముద్దుల్లోనే మునిగి తేలుతున్నట్టు చూపిస్తారని మండిపడ్డారు. సమాజానికి చేతనైనంత సాయం చెయ్యాలంటే ఉన్నంతలో విలువలను పాటించాలని హితవు పలకాలని సూచించారు. సినిమాల్లో పాత్రలు వారి వారి ఇళ్లలో ఉంటాయేమోనన్నది యువతరం గమనించాలని సూచించారు. ఆ పాత్రల్లానే వ్యక్తుల స్వభావాలు ఉంటే కుటుంబానికి, దేశానికి మనుగడే ఉండదని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News