: 'విశ్వరూపం'కి తొలగిన అడ్డంకులు


విలక్షణ నటుడు కమల్ హాసన్ దర్శకత్వంలో వచ్చిన విశ్వరూపం సినిమా ఎట్టకేలకు తమిళనాడులో విడుదలకు నోచుకోనుంది. ముస్లిం సంఘాలతో కమల్ చర్చలు ఫలించాయి. సినిమాలో ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఏడు అభ్యంతరకర సన్నివేశాలు, ఎనిమిది సంభాషణలను తొలగించేందుకు కమల్ అంగీకరించారు.

దీంతో ఆందోళన విరమించి... 'విశ్వరూపం'పై దాఖలు చేసిన ఫిర్యాదులను వెనక్కు తీసుకుంటామని 
ముస్లిం సంఘాలు తెలిపాయి. కమల్ కూడా తాను తమిళనాడు హైకోర్టులో వేసిన రిట్ పిటిషన్ ను వెనక్కు తీసుకుంటున్నట్లు తెలిపారు. తమిళనాడులో 'విశ్వరూపం' విడుదల చేసే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని కమల్ హాసన్ చెప్పారు. ముస్లిం సంఘాలతో చర్చలకు సహకరించిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కమల్ హాసన్ ధన్యవాదాలు తెలిపారు. 

  • Loading...

More Telugu News