: బెజవాడలో నూరేళ్ల సినిమా పండగ
కృష్ణా జిల్లా తెలుగు చలనచిత్ర రంగానికి పుట్టిల్లు లాంటిది. అందుకే తెలుగు సినీ జగత్తుతో కృష్ణా జిల్లాకు విడదీయరాని అనుబంధం ఉంది. ఈ గడ్డమీద జన్మించిన రఘుపతి వెంకయ్య, నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, శోభన్ బాబు వంటి అతిరథ మహారథులను గుర్తుకు తెచ్చేలా విజయవాడలోని తుమ్మలపల్లి కళా క్షేత్రంలో వందేళ్ల సినీ సంబరాలు ఈ రోజు సాయంత్రం ప్రారంభం అయ్యాయి. ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో రామానాయుడు, దాసరి, రాఘవేంద్రరావు పాల్గొన్నారు.