: అమితాబ్ ను మరిపించలేను.. నా పరిధిలో నేను నటించాను: రాం చరణ్
జంజీర్ సినిమా ద్వారా బాలీవుడ్ కు పరిచయమవుతున్న చిరంజీవి తనయుడు రాంచరణ్ అమితాబ్ స్థాయి నటన ప్రదర్శించడం ఎవరి వల్లా కాదన్నారు. జంజీర్ సినిమా సెప్టెంబర్ 6 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న నేపథ్యంలో మీడియాతో తన భావాలను పంచుకున్నారు. అపూర్వ లఖియా ఈ సినిమా కథను చెప్పినప్పుడు భయపడ్డానని, కానీ తన తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతోనే దీన్ని ఒప్పుకున్నానని తెలిపారు. అలాగే తాను అందర్లో ఉత్కంఠ రేకెత్తించే అమితాబ్ పాత్ర పోషిస్తున్నానని, ఏమాత్రం పట్టు తప్పినా అధఃపాతాళానికి పడిపోతానని, అందుకే చాలా జాగ్రత్తలు తీసుకున్నానని తెలిపారు. అమితాబ్ యువతను ప్రోత్సహించడంలో ముందుంటారని, ధైర్యంగా ఈ సినిమా చేస్తున్నందుకు తనను అభినందించారని అన్నారు. సినిమా షూటింగ్ సమయంలో ప్రియాంకతో బాగా మైత్రి కుదిరిందని రాంచరణ్ తెలిపారు.