: బుద్ధగయ బంద్ కు బీజేపీ పిలుపు
బుద్ధుల పవిత్ర స్ధలమైన బుద్ధగయలో వరుస బాంబు పేలుళ్లను ఖండిస్తూ, బీజేపీ రేపు బుద్ధగయ బంద్ కు పిలుపునిచ్చింది. బీహార్ రాష్ట్రంలో అధికార జేడీయూ ఇటీవలే బీజేపీతో మైత్రికి చరమగీతం పాడింది. దీంతో తాజా ఘటన నేపథ్యంలో బీజేపీ జేడీయూపై ధ్వజమెత్తడానికి అందివచ్చిన ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకుంటుంది. దీంతో ప్రస్తుత ఉగ్రదాడి ప్రభుత్వ వైఫల్యం కారణంగా జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. అందులో భాగంగా రేపు బంద్ కు పిలుపునిచ్చింది.