: భవిష్యత్తు టీడీపీదే... తిరుగులేని మెజారిటీ సాధిస్తాం: బాబు
2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తిరుగులేని విజయం సాధిస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ జిల్లా కాజీపేటలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎలాగూ తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని, అంతేకాకుండా దేశరాజకీయాల్లో తమ పార్టీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేదని, బీజేపీకి ఓట్లు పెరగవని చెప్పిన ఆయన, కేంద్రంలో మూడో ప్రత్యమ్నాయమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవదని బాబు జోస్యం చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే అమరవీరుల కుటుంబాలను ఆదుకుని, ఉద్యమకారులపై కేసులు ఎత్తేస్తామన్నారు.