: వర్షాలు కురవట్లేదని ఆచారానికి పునర్జీవనం


వరుణుడి కటాక్షం కోసం ఆ మండలం వాసులు చూసీచూసీ ఇక లాభం లేదని పురాతన సంప్రదాయానికి తెరతీసారు. దేవుడి కటాక్షానికి మరింత కాలం ఎదురుచూస్తే పంటలకు ఇబ్బందని శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం పురుషోత్తమపురం గ్రామస్థులు వంశధార నది నీటితో శ్రీఉమాకామేశ్వర స్వామి ఆలయంలో కుంభాభిషేకం నిర్వహించారు. చిన్నాపెద్దా తేడా లేకుండా గ్రామస్థులంతా నది ఒడ్డుకు చేరి తలా ఓ బిందెడు నది నీటితో శివలింగానికి అభిషేకం చేశారు. నది నీటితో శివలింగం పూర్తిగా నీటమునిగింది. ఇలా చేస్తే వానలు పడతాయని గ్రామస్థుల నమ్మకం. ఇది తరాలుగా వస్తున్న సంప్రదాయమని కరవు కాటకాలు వచ్చినప్పుడు ఇలా వరుణ దేవుడి కోసం ప్రత్యేకంగా కుంబాభిషేకం నిర్వహిస్తే వానలు పడతాయని గ్రామస్తులు తెలిపారు.

  • Loading...

More Telugu News