: తెలంగాణ ఇస్తామన్న సంకేతమే అది: ఎంపీ పొన్నం


తెలంగాణ ఇస్తారనే దానికి సంకేతమే నిర్ణయం తీసుకుంటామని చెప్పడమని టీకాంగ్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ తెలంగాణ ప్రకటిస్తుందని అన్నారు. తెలంగాణపై తేల్చేసేందుకు అధిష్ఠానం పెద్దలంతా హస్తినలో మంతనాలు జరుపుతూ బిజీగా ఉన్నారని తెలిపారు. అందరి అభిప్రాయాలతో కూడిన నివేదిక తయారు చేసి అధిష్ఠానానికి ఇస్తామని ఆయన తెలిపారు. స్థానిక ఎన్నికల్లో గెలిస్తే పార్టీ నేతలకు నగదు తాయిలాలు ప్రకటించిన చంద్రబాబుపై ప్రలోభాలకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News