: కళ్లజోడు ధరించి బ్యాటింగ్ చేయనున్న వీరేంద్ర సెహ్వాగ్


వీరబాదుడు బాదే భారత డేషింగ్ బ్యాట్స్ మేన్ వీరేంద్ర సెహ్వాగ్ ఇకపై కొత్త గెటప్ తో మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. శుక్రవారం నుంచి చెన్నయ్ లో జరుగనున్న భారత్- ఆస్ట్రేలియా తొలి టెస్ట్ మ్యాచ్ లో సెహ్వాగ్ కళ్లద్దాలతో బ్యాటింగ్ చేయడానికి సన్నద్ధమవుతున్నాడు. కంటి నిపుణుల సలహాపై వీరూ ఈమధ్యే కళ్లజోడు ధరించడం మొదలెట్టాడు. అయితే, బ్యాటింగు సమయంలో కూడా కళ్లజోడు ధరిస్తాడా? అన్న సందేహం చాలా మందిలో వుంది.

కళ్లద్దాలతోనే వీరూ బ్యాటింగ్ చేస్తాడని భారత జట్టు శిక్షణ శిబిరంలోని ఓ సభ్యుడు తాజాగా స్పష్టం చేయడంతో ఆ అనుమానం తీరిపోయింది. శిక్షణ శిబిరంలో కళ్లజోడుతోనే బ్యాటింగ్ చేసి, అందుకు అలవాటు పడ్డాడనీ, కొన్నాళ్ళ తర్వాత కళ్లజోడు స్థానంలో కాంటాక్ట్ లెన్సులు ధరిస్తాడనీ ఆ సభ్యుడు తెలిపాడు. గతంలో గంగూలీ కూడా ఇదే విధంగా కళ్లజోడు ధరించి కొన్నాళ్ళు ఆడిన తర్వాత, కాంటాక్ట్ లెన్సులు ధరించాడు. 

  • Loading...

More Telugu News