: ఎన్డీయేతో జతకట్టేది లేదు: ఒమర్ అబ్దుల్లా


జమ్మూ కాశ్మీర్లో అధికారంలో ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ ఎప్పటికీ ఎన్డీయేతో జతకట్టదని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మరోసారి స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో మాట్లాడిన ఆయన, 3 లోక్ సభ స్థానాలు, 2 రాజ్యసభ స్థానాలు ఉన్న తమ పార్టీ ఎప్పటికీ బీజేపీతో పొత్తు పెట్టుకోదని తేల్చేశారు. గతంలో కేవలం వాజ్ పేయి కారణంగా నేషనల్ కాన్ఫరెన్స్ బీజేపీతో పొత్తు పెట్టుకుందే తప్ప ఇంకే కారణమూ లేదన్నారు. భవిష్యత్తులో అలాంటి సందర్భం తలెత్తదని ఒమర్ అబ్దుల్లా స్పష్టంగా చెప్పారు.

  • Loading...

More Telugu News