: సినిమాలను పబ్లిసిటీ కోసం నిర్మించను: కమల్ హాసన్
సినిమాలను పబ్లిసిటీ కోసం నిర్మించనని యూనివర్సల్ నటుడు కమల్ హాసన్ తెలిపారు. తన సినిమాలను ప్రేక్షకులు ఎంజాయ్ చేయడానికి తీస్తానని ఆయన అన్నారు. 'సాధారణంగా సినిమా విడుదలైన ఏడాది తరువాత సీక్వెల్ తీస్తానని చెబుతారనీ, కానీ తాను మాత్రం విశ్వరూపం 2 సినిమాను తొలి పార్ట్ తీస్తున్నప్పుడే ప్రకటించానన్నారు. అలా ప్రకటించడం అతివిశ్వాసం కాదని, తన ఆత్మవిశ్వాసమని, కథపై ఉన్న విశ్వాసమని కమల్ అభిప్రాయపడ్డారు. ఈ సినిమాకు రచయిత, దర్శకుడు, నిర్మాత కమల్ హాసన్ కావడం విశేషం. తాను తన అభిమానులకు పూర్తి కధ చెప్పేందుకు ప్రయత్నిస్తానని, అందుకే సినిమా నిడివి కాస్త ఎక్కువ ఉంటుందని అన్నారు. విశ్వరూపం 2 సినిమాను సాంకేతికంగా ఉన్నతంగా తీర్చిదిద్దిన తరువాత ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తానని కమల్ తెలిపారు.