: ఫేస్ బుక్ ఉద్యోగులకు తప్పిన పెను ప్రమాదం
ఫెస్ బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెరిల్ సాండ్ బర్గ్, ఇతర ఉద్యోగులు ఇవాళ పెను ప్రమాదాన్ని తప్పించుకున్నారు. వ్యాపార పని మీద కొరియా వెళ్లిన వీరు తిరుగు ప్రయాణానికి ఈ ఉదయం ప్రమాదం బారిన పడిన ఏషియానా విమానానికి టికెట్లు కొనుక్కున్నారు. అయితే వేర్వేరు కారణాలతో అందరూ వేరే విమానాల్లో శాన్ ఫ్రాన్సిస్కో చేరుకున్నారు. అనంతరం ప్రమాద వార్త తెలిసి నిర్ఘాంతపోయారు. అనంతరం తాము క్షేమంగా ఉన్నామని, తమ ప్రయాణం గురించి తెలిసి ఎవరైనా ఆందోళన చెందితే క్షమించమంటూ షెరిల్ వెంటనే ట్విట్టర్లో పోస్టు చేశారు.