: హృతిక్ రోషన్ కు బ్రెయిన్ సర్జరీ
బాలీవుడ్ ప్రముఖ హీరో హృతిక్ రోషన్ కు ఈ రోజు హిందూజా హాస్పిటల్ లో బ్రెయిన్ సర్జరీ జరుగనుంది. అతను సర్జరీ రూంలోకి వెళ్లే ముందు, ప్రపంచంలో అత్యంత సృజనాత్మకమైన మేథో శక్తికి జోహార్లు, దేవుడిచ్చిన శక్తిమంతమైన వరం బ్రైన్. కానీ ఎప్పుడో ఏదో ఒక సందర్భంలో తప్ప అదెంత శక్తిమంతమైనదన్న విషయాన్ని గుర్తించలేం. దాని ద్వారానే చూస్తాం, వింటాం, స్ప్రుశిస్తాం, వాసన చూస్తాం, రుచీ చూస్తాం, అలాగే భయం, ధైర్యం, ఊహాశక్తి ఇవన్నీ లిఖితపూర్వకంగా అనుభవిస్తున్నానంటూ ఫేస్ బుక్ అకౌంట్ లో కామెంట్ పెట్టాడు.
అయితే, హృతిక్ రోషన్ కి జరుగనున్న సర్జరీని 'క్రానిక్ సబ్డ్రుల్ హీమోటోమా' అని అంటారని అతని తండ్ర రాకేష్ రోషన్ తెలిపారు. ఇది తలపై ఏదైనా ఓత్తిడి జరిగితే వస్తుందని ఆయన అన్నారు. 'క్రిష్ 3' సందర్భంగా హృతిక్ రోషన్ భారీ యాక్షన్ సన్నివేశాలలో పాల్గోన్నాడు. అప్పుడు జరిగిన పలు సంఘటనల్లో గాయపడడం వల్ల ఇప్పడీ సర్జరీ చేసుకోవాల్సి వస్తోంది. అతను తొందర్లోనే కోలుకుని ఆరోగ్యంగా బయటకు రావాలని కోరుకుందాం!