: అమెరికన్లకు లక్ష ఉద్యోగాలిచ్చిన భారత కంపెనీలు
భారత కంపెనీలు అమెరికాలో పెట్టిన పెట్టుబడుల విలువ 1100 కోట్ల డాలర్లు. మన కరెన్సీలోనే చెప్పాలంటే 66,000కోట్ల రూపాయలు. దీని ద్వారా అక్కడ లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. అమెరికాలో భారతీయ కంపెనీల పెట్టుబడులు, ఉద్యోగావకాశాల కల్పన పేరుతో అమెరికా, భారత వాణిజ్య మండలి ఈ వివరాలతో ఒక నివేదిక రూపొందించింది.