: అమ్మ చెప్పే పాఠాలతోనే అవినీతి నిర్మూలన మొదలవ్వాలి :లక్ష్మీనారాయణ
అమ్మ చెప్పే పాఠాలతోనే అవినీతి నిర్మూలన మొదలవ్వాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. అనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సమాజానికి నిజమైన సేవ అందాలంటే స్వచ్చంధ సంస్థలన్నీ కలిసి ఒకే తాటిఫైకి వచ్చి పనిచేయాలన్నారు. ఆదర్శవంతమైన మనుషులు తయారవ్వాలంటే ప్రతి ఇంట్లో వేమన, సుమతీ శతకం లాంటి పుస్తకాలు ఉండాలన్నారు. సినిమా డీవీడీలకు బదులుగా ఇంట్లో రామాయణం, మహాభారతం లాంటి గ్రంధాలు ఉండాలని ఆయన సూచించారు .