: మైదానంలో పోట్లాడుకున్న రైనా, జడేజా


"నువ్వు కెప్టెన్సీని పోగొట్టుకున్నావు. ఇప్పుడు ఆటపై శ్రద్ధను కూడా కోల్పోయావు"... ఇవి సురేశ్ రైనాను ఉద్దేశించి జడేజా అన్న మాటలు. ఈ మాటలే మైదానంలో వారిద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీశాయి. కొట్టుకుంటారా? అనే స్థాయిలో ఆందోళన కలిగించాయి. విషయం ఏమిటంటే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో శుక్రవారం విండీస్, భారత జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఆటలో భాగంగా జడేజా బౌలింగ్ లో సురేశ్ రైనా రెండు సార్లు క్యాచ్ మిస్ చేశాడు. ఒకసారి క్యాచ్ పట్టుకోలేకపోగా, మరోసారి అసలు పట్టుకోవడానికి కూడా ప్రయత్నించనేలేదు. బంగారంలాంటి అవకాశాలను జారవిడిచాడన్న కోపంతో జడేజా రైనాను సమీపించి మాటలతో దెప్పి పొడిచాడు. నొచ్చుకున్న రైనా కూడా జడేజాపై మాటల యుద్ధానికి దిగాడు. గొడవ ముదురుతుందనగా.. సహచర ఆటగాళ్లు వారికి సర్ధిచెప్పి శాంతింపజేశారు.

  • Loading...

More Telugu News